గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జిల్లా
సూక్ష్మజీవశాస్త్ర విభాగము (Microbiology Department)
గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు సూక్ష్మజీవశాస్త్ర విభాగమునయందు కాంట్రాక్ట్ పద్ధతిలో తేది 31.03.2020 వరకు పనిచేయుటకు, ఈ క్రింది పోస్టులను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. కాంట్రాక్ట్ వ్యవధి గవర్నమెంట్ వారు పెంచుటకు అవకాశం కలదు.
A. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ – 01
విద్యార్హత: B.Sc (MLT) లేదా DMLT విద్యార్హతతో రెండు సంవత్సరముల క్లినికల్ ల్యాబ్ లో పని చేసిన వారు అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగియుండవలెను.
జీతం: నెలకు రూ 15,000/-లు
వయోపరిమితి : 40 సంవత్సరాలు లోపు వారు అర్హులు.(01.07.2019 నాటికి)
B. డేటా మేనేజర్ పోస్ట్ – 01
విద్యార్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీ (Bsc Computers ) లేదా డిప్లమో కంప్యూటర్(DCA) కలిగి మరియు MS Office Word/ Excel/PPT నందు కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారు అర్హులు.
జీతం : నెలకు రూ 12,000/-లు
వయోపరిమితి : 40 సంవత్సరాలు లోపు వారు అర్హులు. (01.07.2019 నాటికి)
C. ఫార్మసిస్ట్ పోస్ట్ – 01
విద్యార్హత: ఇంటర్ సైన్స్ సబ్జెక్టుతో (Bipc) ఉత్తీర్ణులై ఏదైనా గుర్తింపు కలిగిన సంస్థ యందు డిప్లమో ఫార్మసీకలిగి, ఏదైనా హాస్పటల్ / ఫార్మసీ కంపెనీ / మందుల షాపు యందు పనిచేసిన అనుభవం కలిగి ఉండవలెను. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగియుండవలెను.
జీతం: నెలకు రూ 18,000/-లు
వయోపరిమితి : 45 సంవత్సరాలు లోపు వారు అర్హులు. (01.07.2019 నాటికి)
పూర్తిచేసిన దరఖాస్తులను పంపవలసిన చిరునామా :
The Principal, Guntur Medical College, Kannavarithota, Guntur-522004, Andhra Pradesh నకు
(పూర్తిచేసిన దరఖాస్తులు తేది:11-01-2020 నుండి కార్యాలయపు అన్ని పని దినములలో ఉదయ౦ 10:30 గంటల నుండి సాయంత్రము 5 గంటల వరకు తీసుకోనబడును)
*పూర్తిచేసిన దరఖాస్తులు చేరవలసిన ఆఖరు తేది 25-01-2020 సాయంత్రము 5 గంటల వరకు తీసుకోనబడును *